📄 ePaper
Thursday, June 25, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅనారోగ్యంతో చికిత్స పొందుతున్న వంగ మంజుల-నరసింహారెడ్డిని పరామర్శించిన

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వంగ మంజుల-నరసింహారెడ్డిని పరామర్శించిన

📰 Generate e-Paper Clip

•తెలంగాణరాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్–భూంపల్లిమండలం.జనవరి18
అల్మాజిపూర్ మాజీ సర్పంచ్ వంగ మంజుల నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ సిద్దిపేటలోని పీపుల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణరాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కివెంకటయ్య శనివారం ఆసుపత్రికి వెళ్లి నరసింహారెడ్డిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. నరసింహారెడ్డికి అత్యుత్తమ వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులను కోరారు.ఈ పరామర్శ కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్యతో పాటు అక్బర్‌పేట్–భూంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మండల కుమార్, భూంపల్లి సర్పంచ్ రంగయ్య గారి జంగారెడ్డి, వీరారెడ్డిపల్లి సర్పంచ్ బాల మల్లేశం గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular