స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, టీయూఎఫ్‌ఐడీసీ నిధులు కొనసాగించాలని డిమాండ్
సదాశివపేట,జనవరి12(మనప్రజాప్రతినిధి):
సోమవారం సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సమావేశంలో మాట్లాడిన పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సదాశివపేట పర్యటనలో భాగంగా సిద్ధాపూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించి న కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటికి సరైన పొజిషన్ చూపించలేదన్న విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడే ఇళ్ల పట్టాలు గుర్తుకు వస్తాయా? ఎన్నికలు ముగిశాక బీద ప్రజలు గుర్తుకు రారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరా లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనిని ఇప్పుడు అధికారంలో కి వచ్చి రెండేళ్లు అవుతున్నా పూర్తి చేయకుండా, ఎన్నికల వేళ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజలు ఈ మాటలను నవ్వుతూ చూస్తున్నారని, అయినా ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని అనుకుంటే మేమేం చేయలేమని శివరాజ్ పాటిల్ ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అక్బర్ హుస్సేన్ మాట్లాడుతూ.. అమాయక మైనారిటీ ప్రజలను తమ వెంట తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్లాట్ల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బీద ప్రజల ఆశలను మీరు ఎన్నటికీ నెరవేర్చలేరని వ్యాఖ్యానించారు.మాజీ కో-ఆప్షన్ సభ్యులు కోడూరు అంజయ్య మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడు చింతా ప్రభాకర్ అని, ఆయనను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, అభివృద్ధిలో ముందుండే నాయకుడు చింతా ప్రభాకర్ అని కొనియాడారు. ఆయన చేసిన అభివృద్ధిని చూస్తూ కూడా ఈ రకంగా మాట్లాడడం బుద్ధిహీనతకు నిదర్శనమని అన్నారు. గతంలో ఇచ్చిన ప్లాట్లకు జిరాక్స్ సెంటర్లే జీవనాధారంగా మారాయని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి తీసుకురావద్దని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సదాశివపేట అభివృద్ధి జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ తీసుకువచ్చిన నిధులను వెనక్కి తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌ను వెనక్కి తీసుకోవడం బాధాకరమని, అలాగే టీయూఎఫ్‌ఐడీసీ నిధులను వెనక్కి తీసుకొని పేరు మార్చి కొత్త ప్రపోజల్స్ తెచ్చి పాత ప్రపోజల్స్‌ను క్యాన్సిల్ చేయడం సరికాదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, టీయూఎఫ్‌ఐడీసీ నిధులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటిల్, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కోడూరు అంజయ్య, అక్బర్ హుస్సేన్, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మున్సిపల్ కౌన్సిలర్లు ఇంద్ర మోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, ముబిన్ మోహియోద్దీన్, నసీరుద్దీన్, సమీ ఖాజా, మైనారిటీ అధ్యక్షుడు కామిల్ అన్సార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు డప్పు నర్సింలు, బరాడి శివ, అయ్యో ఖురేషి నాని, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, నాగుల విజయ్, కుదూస్, కౌన్సిలర్ ఆకుల శివకుమార్, సాతాని శ్రీశైలం, శ్రీనివాస్, దిడిగే నాగేష్ తదితర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విమర్శించే స్థాయి నీది కాదు – ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న నాయకుడు చింతా ప్రభాకర్
RELATED ARTICLES

