•హామీల అమలుకు కార్యాచరణ ప్రారంభం – ప్రజల సమస్యలపై వెంటనే స్పందన
•వార్డు అభివృద్ధికి వేగం-సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్
•ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్-అభివృద్ధి పనుల అమలుకు మల్లేశం కట్టుబాటు
(మనప్రజాప్రతినిధి),దౌల్తాబాద్ మండలం.ఫిబ్రవరి06
దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో 10వ వార్డు సభ్యుడిగా గెలుపొందిన కెంబసారి మల్లేశం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు. ప్రజల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని వార్డులో అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
వార్డులో శుభ్రత నిర్వహణ, తాగునీటి సదుపాయాల మెరుగుదల, వీధి దీపాల ఏర్పాటు, కాలువల మరమ్మతులు, రహదారి పనులు వంటి మొత్తం 10 అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేకంగా 10వ వార్డు ప్రజల కోసం వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వార్డులోని ప్రజలు తమ సమస్యలు, సూచనలు, అవసరాలను ఆ గ్రూప్ ద్వారా తెలియజేస్తే వెంటనే స్పందించి పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని మల్లేశం చెప్పారు.ప్రజలతో నేరుగా సంప్రదింపులు కొనసాగిస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా వార్డును సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తున్నట్లు కెంబసారి మల్లేశం స్పష్టం చేశారు.

