7 వార్డుల ఫలితాలు వెల్లడి…5 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో,2 బీఆర్‌ఎస్‌కు
చేర్యాల,ఫిబ్రవరి13(మనప్రజాప్రతినిధి):
చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు వెల్లడైన 7 వార్డుల ఫలితాల్లో 5 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, 2 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది.
వార్డు వారీగా విజేతలు ఇలా ఉన్నారు:
కాంగ్రెస్ పార్టీ:
వార్డు నం.01 – ఒగ్గు వెంకటమ్మ
వార్డు నం.03 – కొమ్ము రాజేశ్వరీ
వార్డు నం.05 – వెలుగుల దుర్గయ్య
వార్డు నం.07 – పోతుగంటి ప్రసాద్
వార్డు నం.12 – షరీఫా బేగం
బీఆర్‌ఎస్ పార్టీ:
వార్డు నం.09 – వీరబత్తిని సదానందం
వార్డు నం.11 – ఎండి ఇజాజ్ అహ్మద్
మొత్తం ఫలితాల నేపథ్యంలో పట్టణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. మిగతా వార్డుల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుండగా, బీఆర్‌ఎస్ నాయకులు మిగిలిన వార్డులపై దృష్టి సారించారు.

