📄 ePaper
Monday, July 13, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుస్వయం పరిపాలన దినోత్సవంతో విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాల పెంపు

స్వయం పరిపాలన దినోత్సవంతో విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాల పెంపు

📰 Generate e-Paper Clip

-విద్యార్థులే ఒక రోజు పాఠశాల పరిపాలన నిర్వహణ
సదాశివపేట,ఫిబ్రవరి12(మనప్రజాప్రతినిధి)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూర్లో “స్వయంపరిపాలన దినోత్సవం”ను ఘనంగా నిర్వహించినట్లు మండల విద్యాధికారి ఎన్. శంకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఒక రోజు పాటు పాఠశాల పరిపాలన బాధ్యతలను స్వీకరించారు. విద్యార్థుల్లో కలెక్టర్‌గా జి. సంజన, ఆర్జేడీగా వి. ప్రవీణ్ కుమార్, డీఈవోగా డి. ఫయాజ్, ఎంఈవోగా పి. చంద్రశేఖర్, హెచ్‌ఎంగా కె. వర్షితబాధ్యతలు స్వీకరించి పాఠశాల కార్యక్రమాలను నిర్వహించారు.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం, సమన్వయ నైపుణ్యాలు ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.భవిష్యత్తులో విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బోధనలో ప్రతిభ కనబరిచి న విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రామకోటయ్య, సిఆర్పి రాజేశ్వర్, ఉపాధ్యాయులు.విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular