•20 ఏళ్ల రోడ్డు కష్టాలకు శాశ్వత పరిష్కారం
•బీడీ కార్మికుల కాలనీలో ప్రారంభమైన రోడ్డు పనులు – ప్రజలకు ఊరట
•సర్పంచ్ ముత్త సంజన మహేష్ చొరవతో చిరకాల సమస్యకు ముగింపు
మనప్రజాప్రతినిధి//వేములవాడ.ఫిబ్రవరి03
చంద్రగిరి గ్రామ అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. బీడీ కార్మికుల కాలనీలో గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. సరైన రోడ్లు లేక ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీ వాసులకు ఊరటకలిగించేలా సర్పంచ్ ముత్తసంజనమహేష్ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్ల చదును పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా సర్పంచ్”ముత్తసంజనమహేష్.మాట్లాడుతూ…“కాలనీ ప్రజల చిరకాల వాంఛ అయిన రోడ్డు సమస్యను పరిష్కరించగలగడం ఎంతో సంతోషంగా ఉంది. గ్రామ అభివృద్ధియే మా ప్రధాన లక్ష్యం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వార్డుల వారీగా సమస్యలను గుర్తించి, వాటిని దశలవారీగా పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారుఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రతినిధులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈర్నాల రాజు-ఉపసర్పంచ్
ముద్దంగుల అంజయ్య-వార్డు సభ్యులు
ఎడెల్లి లక్ష్మి-వార్డు సభ్యులు
ఏడెల్లి సుదర్శన్ -వార్డు సభ్యులు
శేక్ ఇబ్రహీం-వార్డు సభ్యులు
తమ కాలనీ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు పనులు చేపట్టినందుకు కాలనీ ప్రజలు, స్థానిక నాయకులు సర్పంచ్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

