📄 ePaper
Saturday, June 27, 2026
Homeతెలంగాణమహాశివరాత్రి జాతరలో భాగంగా అధికారుల సమన్వయ సమావేశం ఆర్డీవో డీఎస్పీ ఆధ్వర్యంలో

మహాశివరాత్రి జాతరలో భాగంగా అధికారుల సమన్వయ సమావేశం ఆర్డీవో డీఎస్పీ ఆధ్వర్యంలో

📰 Generate e-Paper Clip

మేళ్లచెరువు//ప్రజాప్రతినిధి

మేళ్లచెరువు మండల కేంద్రంలో వేంచేసినటువంటి శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ నెల 15వ తారీకు నుంచి ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరుగు జాతరలో భాగంగా అధికారులు మరియు రాజకీయ నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆర్డీవో మాట్లాడుతూ సుమారు జాతరకి మూడు లక్షలు భక్తులు వస్తారని అధికారులందరూ సమన్వయ సహకారంతో పనిచేసి మేళ్లచెరువు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల జాతరను విజయవంతం చేయాలని తెలిపారు. విచ్చేసినటువంటి గ్రామ పంచాయితీ ఎలక్ట్రిక్ ఆర్టీసీ ఆర్అండ్ బి ఎన్ఎస్పి ఫైర్ రెవెన్యూ సిబ్బందులు వారితో మాట్లాడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల జాతర గురించి చర్చించడం జరిగింది అనంతరం మేళ్లచెరువు ఎస్సై పరమేష్ మాట్లాడుతూ జాతరకి సమయము చాలా తక్కువగా ఉన్నది కాబట్టి రేపటి నుంచే పార్కింగ్ స్థలాలు శుభ్రం చేయాలని బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని మరియు లైటింగ్ ప్రభల గురించి వారు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ సిఐ చరమంద రాజు దేవాలయ ఈవో నాగేల్ల శంబిరెడ్డి ఉత్సవ కమిటీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య ఉత్సవ కమిటీ సభ్యులు సర్పంచ్ బచ్చు పద్మావతి ఎండిఓ గ్రామ పంచాయతీ ఈవో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular