•రోడ్లు,డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యం…ఉంగరం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి
మెదక్జిల్లా,ఫిబ్రవరి 07(మనప్రజాప్రతినిధి):
మెదక్ పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో 27వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా ఎర్రోళ్ల బూదమ్మ ఎన్నికల బరిలో నిలిచారు. శనివారం వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా అభ్యర్థి కుమారుడు ఎర్రోళ్ల వినయ్ తేజ మాట్లాడుతూ, యువత రాజకీయాల్లోకి వస్తేనే వార్డు అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.ప్రస్తుతం వార్డులో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు దయనీయ స్థితిలో ఉన్నాయని, చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్ల పరిస్థితి మారకపోవడం గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వార్డు అభివృద్ధి కోసం యువత సమిష్టిగా ముందుకొచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు.
స్వతంత్ర అభ్యర్థి ఎర్రోళ్ల బూదమ్మకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు.
యువత రాజకీయాల్లోకి వస్తేనే అభివృద్ధి వేగం-స్వతంత్ర అభ్యర్థి ఎర్రోళ్ల బూదమ్మ
RELATED ARTICLES

