📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుహుండీల్లో భక్తి ప్రవాహం…కోట్లలో మేడారం ఆదాయం

హుండీల్లో భక్తి ప్రవాహం…కోట్లలో మేడారం ఆదాయం

📰 Generate e-Paper Clip

•గత జాతరతో పోలిస్తే ఆదాయం స్వల్పంగా తగ్గినా భక్తుల సమర్పణలు భారీగా నమోదు

మనప్రజాప్రతినిధి//వరంగల్.ఫిబ్రవరి10
సమ్మక్క–సారలమ్మ జాతరలో భక్తుల విశ్వాసం మరోసారి హుండీ ఆదాయంలో స్పష్టంగా కనిపించింది. జాతర అనంతరం అధికారులు మొత్తం 828 హుండీలను లెక్కించగా, సుమారు రూ.12.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. లెక్కింపు ప్రక్రియను వారంరోజుల పాటు నిర్వహించగా, నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు కూడా భారీగా లభించాయి.ప్రత్యేకంగా,హుండీల్లో 18 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా ఉండటం విశేషం. గత జాతరతో13.25 రాగ ఈసారి పోలిస్తే  ఆదాయం కొద్దిగా తగ్గినా, భక్తుల రద్దీ సమర్పణ లు భారీ స్థాయిలో కొనసాగాయని అధికారులు తెలిపారు. మేడారం జాతర భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ ప్రతి జాతరలో కోట్లాది రూపాయల ఆదాయాన్ని నమోదు చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular