Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుపశువులపై పంజా విసిరిన కుక్కలు – పేద కుటుంబానికి లక్షన్నర నష్టం

పశువులపై పంజా విసిరిన కుక్కలు – పేద కుటుంబానికి లక్షన్నర నష్టం

📰 Generate e-Paper Clip

•జీవనాధారాన్ని చీల్చిన కుక్కల దాడి-ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితుల విజ్ఞప్తి
•కొట్టంలోనే కరాళ నృత్యం-30 గొర్రె,మేక పిల్లలు మృతి
•పశువుల పెంపకదారుడికి భారీ దెబ్బ-కుక్కల దాడిలో జీవనాధారం నశనం

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి6
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ గ్రామంలో కుక్కల దాడిలో సుమారు 30 గొర్రెలు, మేక పిల్లలు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి సుమారు లక్షన్నర రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
మర్పడ గ్రామానికి చెందిన పిండి నారాయణ గొర్రెలు, మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతిరోజులానే ఉదయం జీవాలకు మేత పెట్టి అడవికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో ఆయన కుమారుడు స్వామి ఇంటికి వచ్చి చూసేసరికి గొర్రెల కొట్టం వద్ద కుక్కలు పరుగులు తీస్తూ కనిపించాయి. వెంటనే కొట్టంలోకి వెళ్లి పరిశీలించగా సుమారు ముప్పై గొర్రె, మేక పిల్లలు మృతిచెందినట్లు గుర్తించారు.
ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. జీవాలపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం అందించాలని బాధితులు అధికారులను వేడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular