•పిలుపునిచ్చిన మండల అధ్యక్షుడు”పేరంనాగరాజునాయుడు
మనప్రజాప్రతినిధి,ఏర్పేడుమండలం,ఫిబ్రవరి16
రేపు(17-02-2026,మంగళవారం) ఉదయం8:00 గంటలకు నిర్వహించనున్న గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయం గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు పిలుపునిచ్చారు.గుడిమల్లం నుంచి ప్రారంభమయ్యే ఈ గిరి ప్రదక్షిణ మిట్టమీదకండ్రిగ,పెనుమల్లం, పాపనాయుడుపేట, మర్రిమంద, వికృతమాల, గోవిందవరం, మునగలపాలెం, మూలకండ్రిగ, ఎం.డి. పుత్తూరు, రాజులకండ్రిగ, పాయలు సెంటర్, చెల్లూరు, గుండ్లకండ్రిగ గ్రామాల మీదుగా తిరిగి గుడిమల్లం చేరుతుంది.మధ్యాహ్నం 12:00 గంటలకు గోవిందవరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తి, సేవా భావంతో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని ఆయన కోరారు.
“భక్తి –ఐక్యత –సేవా భావం…గిరి ప్రదక్షిణతో ఆధ్యాత్మిక మహోత్సవం”
ఆధ్యాత్మిక ఉత్సాహానికి సిద్ధం కావాలి..గిరిప్రదక్షిణలో భారీగా పాల్గొనండి
RELATED ARTICLES

