📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువిజయానికి గుర్తింపుగా ఘన సన్మానం

విజయానికి గుర్తింపుగా ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

•కౌన్సిలర్ పులిమామిడి మమతకు పి.ఎం.ఆర్ యువసేన నాయకుల అభినందనల వెల్లువ
సదాశివపేట,ఫిబ్రవరి16(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో 12వ వార్డు నుండి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకౌన్సిలర్.పులిమామిడి మమతను పి.ఎం.ఆర్ యువసేన నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పులిమామిడి మమత మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు, విశ్వాసంతో మద్దతు ఇచ్చిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వార్డు అభివృద్ధిని వేగవంతం చేస్తూ సేవాభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాగం అనిల్, గుణాకర్, ఆనంద్, అఖిల్, ఆంజనేయులు గౌడ్, మాలె శ్రీను, సుధాకర్, శివ, తాలెల్మ రాము, సోమ శంకర్ తదితరులు పాల్గొని కౌన్సిలర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల నమ్మకమే నా బలం – అభివృద్ధే నా లక్ష్యం” అంటూ మమత స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular