📄 ePaper
Wednesday, August 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన హౌసింగ్ ఎండి వి.పి. గౌతమ్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన హౌసింగ్ ఎండి వి.పి. గౌతమ్

📰 Generate e-Paper Clip

•షేర్‌వాల్ టెక్నాలజీతో నాణ్యమైన ఇళ్లు-లబ్ధిదారులుసద్వినియోగం చేసుకోవాలి
సదాశివపేట,ఫిబ్రవరి3(మనప్రజాప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ సదాశివపేట మండలం ఆరూరు గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం సందర్శించారు. గ్రామపంచాయతీ పరిధిలో షేర్‌వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా హౌసింగ్ ఎండి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన ఐదు లక్షల రూపాయల వ్యయ పరిమితిలోనే షేర్‌వాల్ టెక్నాలజీ ద్వారా నాణ్యమైన ఇళ్లను పూర్తిచేసి నిరుపేదలకు అందించనున్నట్లు తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని లబ్ధిదారులందరూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి నాయికోటి లావణ్య – మధు మాట్లాడుతూ, హౌసింగ్ ఎండి ఆరూరుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. వారి సలహాలు, సూచనలతో గ్రామంలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిడి చలపతిరావు, ఆర్డీవో జనర్దన్, ఎంపీడీవో కె.లక్ష్మి, ఎమ్మార్వో బాలరాజ్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, డి. మాధవ రెడ్డి, ఏ.హౌసింగ్ రేష్మ, పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ విట్టల్, మాజీ సర్పంచ్ మధు, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.