📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా:మిద్దె శివకుమార్

గ్రామ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా:మిద్దె శివకుమార్

📰 Generate e-Paper Clip

వర్షానికి నిలిచిన నీటిని వెంటనే తొలగించి, కాలనీవాసుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిన సర్పంచ్
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి25
గ్రామంలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ తెలిపారు.మంగళవారం దుద్దెడ గ్రామంలోని కొత్త వాడకట్టు కాలనీలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీరు నిల్వవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే సర్పంచ్ స్పందించి, నిల్వ నీరు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలోకి వెళ్లేలా చర్యలు చేపట్టించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గ్రామ సమస్యలపై సత్వరమే స్పందిస్తూ, నల్లాల లీకేజీలు, మురుగునీటి సమస్యలు, రహదారుల మరమ్మతులు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలలో చురుకుగా వ్యవహరిస్తున్న సర్పంచ్‌ను అభినందించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్న ఆయనకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.