Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజా సమస్యలు పక్కనపెట్టి రాజకీయ కక్షపాలన:-రేవంత్ రెడ్డిపై ఇరుకోడు బీఆర్‌ఎస్ శ్రేణుల భగ్గుమన్న ఆగ్రహం

ప్రజా సమస్యలు పక్కనపెట్టి రాజకీయ కక్షపాలన:-రేవంత్ రెడ్డిపై ఇరుకోడు బీఆర్‌ఎస్ శ్రేణుల భగ్గుమన్న ఆగ్రహం

📰 Generate e-Paper Clip

ఆరు గ్యారెంటీలు గాలికొదిలి ప్రతిపక్షాలపై కక్ష సారింపు చర్యలు –ఇరుకోడులో రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న బీఆర్‌ఎస్ నాయకులు
రైతు సంక్షేమాన్ని మరిచి రాజకీయ ప్రతీకార పాలన-సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రవిమర్శలు
నోటీసుల రాజకీయంతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం – బీఆర్‌ఎస్ నాయకుల మండిపాటు
రైతుబంధు ఇచ్చిన నాయకుడిపై అక్రమ కేసులు అన్యాయం-ఇరుకోడు బీఆర్‌ఎస్ ఆగ్రహం
కేసీఆర్–హరీష్ రావుపై వేధింపులు ఆపాలి-లేకపోతే ఉద్యమాలు ఉద్ధృతం
కేసీఆర్‌పై సిట్ విచారణ ప్రజాస్వామ్యానికి కళంకం – సీఎం దిష్టిబొమ్మ దగ్ధం,భారీ రాస్తారోకో
సిద్దిపేటనియోజకవర్గం,ఫిబ్రవరి1(మనప్రజాప్రతినిధి):
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగామరిచిపోయి, రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై సిట్ విచారణకు ఆదేశాలు ఇవ్వడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వ పాలనకు నిదర్శనమని ఇరుకోడు గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు గ్రామంలో బీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. రైతుబంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలతో రైతులను ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేస్తూ, అటువంటి నేతపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని మండిపడ్డారు.ప్రజా పాలనపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులను వేధించడమే తన ప్రధాన అజెండాగా పెట్టుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌కు, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమేనని స్పష్టం చేశారు.
తమ నాయకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని గద్దె దింపే వరకు పోరాటాలు ఆగవని స్పష్టంగా ప్రకటించారు.
ఈ నిరసనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. దాంతో దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇరుకోడు గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బొర్ర రాజాబాబు, మా రెడ్డి మధుసూదన్ రెడ్డి, వాసూరి స్వామి, కుంభం సురేష్ రెడ్డి, బొర్ర శేఖర్, వాసూరి శేఖర్, మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొప్పిడి శ్రీనివాస్, బాలరెడ్డి, కుచ్చుల శ్రీనివాస్, మంతపురి రంజిత్ గౌడ్, చల్ల విజేందర్ రెడ్డి,తాళం కొండల్ రెడ్డి గోపాల శ్రావణ్, కుచ్చుల తిరుపతి, గణపురం రమేష్, బొర్ర బాగయ్య, వెంకటయ్య, చంద్రమోహన్ రెడ్డి, బండి మల్లయ్య, మన్నే కుమారస్వామి, ఎండీ సల్మాన్, శనిగరం బిక్షపతి, తోట్ల కిష్టయ్య, కనకయ్య, కనకరాజు, రాజిరెడ్డి, బాలకిషన్, మన్నే విష్ణు, లింగంపల్లి పరమేష్, ఆనంద్, సాయి, రాజు, రాజయ్య, బొర్ర బాలయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular