Friday, February 27, 2026
ads
Homeతెలంగాణనారాయణ ఖేడ్ లో జోరుగాఅక్రమ కల్తీ కల్లు అమ్మకాలు ఏనాడూ తనిఖీలు చేయని ఎక్సైజ్ అధికారులు

నారాయణ ఖేడ్ లో జోరుగాఅక్రమ కల్తీ కల్లు అమ్మకాలు ఏనాడూ తనిఖీలు చేయని ఎక్సైజ్ అధికారులు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి,02
అధికారుల కనుసన్నల్లోనే కల్తీ కల్లు వ్యాపారాలు
నారాయణ ఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో1,2 కల్లు దుఖానాలు కొనసాగుతున్నాయి. కేవలం వెళ్ళమీద లెక్కబెట్టే దుకాణాలకు మాత్రమే ప్రభుత్వం నుండి అనుమతులు ఉండగా మిగతావి అన్ని అక్రమ దుకాణాలే. అనుమతులు లేని దుఖానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సంబంధిత అధికారులు,సిబ్బందికి తెలుసు అయినా చర్యలు తీసుకోవడం లేరు.మేము దాడులు చేస్తున్నామని చెబుతున్న ఎక్సైజ్ సిఐ రఘునాథ్ రెడ్డి మరి పట్టుకున్న విషయం ఏనాడు మీడియాకు చెప్పలేరు. అదేవిధంగా కల్తీ కల్లు పరీక్షల నిమిత్తం ల్యాబుకు పంపించామని చెబుతున్న కల్తీ కల్లు అని తెలితే ఎంతమంది కల్లు దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారో వివరించాలి. ఇక కల్తీ కల్లు విషయానికి వస్తే అది కల్తీ కల్లు అని తెలిసిన,ప్రాణాలు పోతాయి అని తెలిసిన గ్రామీణ మరియు పట్టణ ప్రాతాoలలో నిరుపేదలు కల్లుకు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అనేది తెలుసుకుందాం. వందల రూపాయలు పెట్టి మద్యం సేవించలేనివారు,కల్తీ కల్లులోని రసాయణాలకు బానిసలుగా మారిన వారు కేవలం 10 నుండి 20 రూపాయలకే కల్లు లభించడం వల్ల కల్లు సేవిస్తున్నారు.సహజంగా చెట్ల నుండి తీసిన కల్లులో రసయనాలు, నీళ్లు ఇతర పదార్థాలు కలిపి భారీగా తయారు చేసి కల్లు కాంపౌండ్ లో విక్రయిస్తారు. ఇలాంటి కల్లు తాగడం వల్ల అవయవాలు పనిచేయకుండా పోయి,ప్రాణాంతకంగా మారుతుంది.సాధారణంగా గ్రామీణా మరియు పట్టణ ప్రాంతాలలోని అడ్డాకూలీలు, నిరుపేదలు,కొందరు ఉద్యోగులు సైతం కల్లు తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది.స్వచ్ఛమైన చెట్టునుండి తీసిన కల్లు లో ఎన్నో ఔషద గుణాలు ఉండడం వల్ల గ్రామాలలో కల్లు తాగడం పెద్ద సమస్యగా,వింతగా చూడరు.కానీ పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి ఈత,తాటి చెట్లు లేకపోవడం వల్ల స్వచ్ఛమైన కల్లు దొరకడం చాలా కష్టం. ఈ విధంగా కొద్దిపాటి కల్లులో రసాయనాలు ఇతర పదార్థాలు కలిపి డ్రమ్ముల చొప్పున కల్తీ కల్లు తయారు చేసి కల్లు కాంపౌండ్ లలో విక్రయిస్తారు.సహజంగా కల్లు పులిసిపోయినప్పుడు తక్కువ మోతాదులో ఆల్కహాలును కలిగి ఉంటుంది.దీంతో డిమాండ్ కు సరిపడ కల్లు లభించకపోవడంతో ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న దురాశతో యజమానులు ఆ కల్లులో వివిధ హానికారమైన పదార్థాలను కలిపి ఎక్కువ చేసి అమ్ముతారు.1.క్లోరల్ హైడ్రెట్ : ఇది ఒకరకమైన మత్తుమందు. సహజమైన కల్లులో ఇది కలపడం వల్ల అది తాగిన వారికి తక్కువ సమయంలోనే మైకంకమ్మి నిద్ర వస్తుంది,ఇది సేవించడం వల్ల కాలేయం,కిడ్నీ,నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
2.డైజోఫామ్: ఇది సాధారణంగా ఆందోళనను తగ్గించడానికి,కండరాలను సడలించడానికి,వైద్యులు ఆపరేషన్ థియేటర్ లలో ఉపయోగిస్తారు.కల్లులో ఇది కలపడం వల్ల అది తాగిన వారికి మత్తు పెంచుతుంది.
3.ఆల్ఫ్రా జోలం:ఇది ప్రమాధాకరమైంది,దీనిని ప్రభుత్వం నిషేదించినప్పటికి మార్కెట్ లో రహస్యంగా దొరుకుతూనే ఉంది.4.ఓపియం(నల్లమందు ):దీనివల్ల తీవ్రమైన మత్తు,బద్ధకం కలుగుతాయి.
5.మెథనాల్ :ఇది అత్యంత ప్రమాదకరమైన పదార్థం.తక్కువ మోతాదులో దీన్ని తీసుకున్న అది ప్రాణాంతకంగా మారుతుంది.కల్లుకు రంగు,వాసన వేగంగా మత్తును కలిగించేందుకు దీనిని కలుపుతారు.
6.బెంజాయిక్ యాసిడ్: కల్లు పాడవకుండా,ఎక్కువరోజులు నిల్వవుండడానికి దీనిని కల్తీ కల్లులో కలుపుతారు.
7.ఈస్ట్:కల్లును త్వరగా పులిసిపోయేలా చేసి ఎక్కువ ఆల్కహాల్ ఉత్పత్తి అయ్యేలా చేయడానికి దీనిని కలుపుతారు.ఈ విధంగా రసాయనాలు,ఇతర పదార్థాలు కలిపిన కల్తీ కల్లు తాగడం వల్ల తల తిరగడం,వాంతులు, కడుపులో సౌకర్యం, కడుపునొప్పి, అతిసార,విరేచనాలు రావడం,కళ్ళు దెబ్బతిని ద్రుష్టి కోల్పోవడం లేదా శాశ్వత అందత్వం రావచ్చు,తీవ్రమైన భరించలేని తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,మెదడుపై రసాయనాల ప్రభావం వల్ల మూర్చరావడం తర్వాత కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. గుండెపోటు రావడం, బిపి తగ్గడం,గుండె పనితీరుపై ప్రభావం కూడ చూపుతుంది.ఆకలి మందగించడం,ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గి రక్త హీనత రావడం,జీర్ణకోశ సమస్యలు,దీర్ఘాకాలిక దగ్గు,ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్,నరాల బలహీనత,జ్ఞాపకశక్తి తగ్గడం,నిద్రలేమి, మానసిక ఆందోళన కలగడం లాంటి సమస్యలు వస్తాయి. నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో 1లేదా 2 కల్లు దుకాణాలు, పొలిమేరల్లో అక్కడక్కడ అనుమతులు లేని కల్తీ కల్లు దుకాణాలు అనేకం ఉన్న సంబంధిత శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు.సీసాలలో కల్లు స్వచ్ఛమైన పాలకంటే తెల్లగా ఉంటుంది.చూడగానే చెప్పవచ్చు ఇది కల్తీ కల్లు అని,అధికారులు మాత్రం కల్తీ కల్లు దుకాణాలు లేవని ఉంటే సమాచారం ఇవ్వండి లేదా మీరే మా వాహనాలతో రండి అందరం కలిసి తనిఖీలు చేద్దామని మాట్లాడుతున్నారు.ఈ విధంగా ఎక్కడ చూసిన కల్తీ కల్లు దుకాణాలు దర్శనమిస్తున్న ఎక్సైజ్ సిఐ,ఎస్సైలు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహారిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇప్పటికైనా అధికారులు అక్రమ కల్తీ కల్లు వ్యాపారాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular