📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజాతీయ క్రీడావేదికపై సిరిసిల్ల సత్తా చాటిన కడారి అశోక్ కుమార్

జాతీయ క్రీడావేదికపై సిరిసిల్ల సత్తా చాటిన కడారి అశోక్ కుమార్

📰 Generate e-Paper Clip

•మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో మూడు కాంస్య పతకాలు… జిల్లాకు గర్వకారణంగా నిలిచిన సిరిసిల్ల అథ్లెట్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి02
రాజన్న సిరిసిల్ల జిల్లా క్రీడారంగంలో మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. జిల్లాకు చెందిన అథ్లెట్ కడారి అశోక్ కుమార్ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి మూడు కాంస్య పతకాలు సాధించి జిల్లా ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టారు.రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్లో ఫిబ్రవరి 2న నిర్వహించిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన,10 కిలోమీటర్ల రేస్, హై జంప్, లాంగ్ జంప్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి క్రీడాభిమానులను ఉత్సాహపరిచారు.ఈ ఘన విజయం సందర్భంగా అశోక్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఐజీ (పంజాబ్ పోలీస్), ఎన్ఎంఏఏ అధ్యక్షుడు సురేష్ కుమార్ శర్మ, మాజీ డీఐజీ రాకేష్ జోషి తదితర ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.అలాగే గొట్టెముక్కుల శేఖర్, సంఘ స్వామి యాదవ్, బూర శ్రీనివాస్ (మహర్షి హై స్కూల్),రెహమాన్ (ఆర్ ఆర్ కె స్టడీ సర్కిల్)తో పాటు పలువురు క్రీడాకారులు, కోచ్‌లు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, యువత క్రీడల్లో ముందుకు వచ్చి జిల్లాకు, రాష్ట్రానికి కీర్తి తీసుకు రావాలని ఆకాంక్షించారు. కడారి అశోక్ కుమార్ సాధించిన ఈ విజయం జిల్లాలోని యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.