•గ్రామ శాంతి,సమృద్ధి కోసం భక్తుల భారీ పాల్గొనడం
•బ్రహ్మోత్సవాలు విజయవంతంగా కొనసాగాలని ప్రత్యేకఅభిషేకాలు భారీగా పాల్గొన్న భక్తులు
ఎర్పేడుమండలం,ఫిబ్రవరి10(మనప్రజాప్రతినిధి):
శ్రీ పరిశ్రమమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామ దేవత ఏకారమ్మకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని భక్తులు అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి భక్తి వాతావరణం నెలకొంది.ఈ పూజా కార్యక్రమంలో ఉభయదారులు సునీల్ కిషోర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈవో రామచంద్ర రెడ్డి, బోర్డ్ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు.అదేవిధంగా గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి,కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

