Thursday, February 12, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమైనారిటీ కమిటీ ఎన్నికల్లో ఏకగ్రీవ నిర్ణయం.

మైనారిటీ కమిటీ ఎన్నికల్లో ఏకగ్రీవ నిర్ణయం.

📰 Generate e-Paper Clip

•అధ్యక్షునిగా ఎం.డి. మజీద్ పాషా – నూతన కమిటీకి శుభాకాంక్షల వెల్లువ

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.కొండపాకమండలం. ఫిబ్రవరి7
శుక్రవారం నిర్వహించిన ముస్లిం మైనారిటీ కమిటీ ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎం.డి. మజీద్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నయీమ్ పటేల్, అస్లాం, జనరల్ సెక్రటరీగా ఎం.డి. నవీద్, ఖజాంచిగా ఎం.డి. రఫీ యుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు.
అలాగే సలహాదారులుగా జబ్బర్, మొయినుద్దీన్, హైమద్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. నాసర్, ఎం.డి. అజమ్, నోరొద్దీన్, సల్మాన్, మహమ్మద్ హుసేన్, అసద్ తదితర సభ్యులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన మజీద్ పాషా మాట్లాడుతూ, మైనారిటీ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులందరూ ఐక్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular