Monday, February 16, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఅమరవీరులకు వంతడుపుల గ్రామ యువకుల ఘన నివాళి

అమరవీరులకు వంతడుపుల గ్రామ యువకుల ఘన నివాళి

📰 Generate e-Paper Clip

•కొవ్వొత్తుల ర్యాలీతో పుల్వామా వీరులను స్మరించిన గ్రామ ప్రజలు
మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి16
భారతదేశాన్ని కలచివేసిన పుల్వామా ఉగ్రదాడి (ఫిబ్రవరి14 2019)లో ప్రాణత్యాగం చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)కు చెందిన 40 మంది అమరవీరులను స్మరించుకుంటూ వంతడుపుల గ్రామంలో యువకులు ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా యువనేత చిమ్మన గొట్టు శ్రీనివాసు మాట్లాడుతూ పుల్వామా దాడి దేశ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిందని, దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగంఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ వారి త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.అమరవీరుల చిత్రపటాల ముందు దీపాలు వెలిగించి, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ యువకులు భావోద్వేగంతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.“అమరవీరుల త్యాగం – దేశ గర్వం” అంటూ యువకులు నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular