మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి05
సిరిసిల్ల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి భోగ వెంకటేశం తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గురువారం వార్డులోని పలు వీధుల్లో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించగా, స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా భోగ వెంకటేశం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వార్డులో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావాలన్నా, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు కావాలన్నా అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో బి-ఫామ్ ఇచ్చిందని, ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డుకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాసేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.వార్డులోని డ్రైనేజీ సమస్యలు,తాగునీటి కొరత, రోడ్ల దుస్థితి వంటి ప్రధాన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భోగ వెంకటేశంకు తమ మద్దతు తెలిపారు.
అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే వార్డు అభివృద్ధి వేగవంతం-13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భోగ వెంకటేశం
RELATED ARTICLES

