Wednesday, February 11, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలు“పోచమ్మపై ఒట్టు…కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీప్రియ గెలుపే మా లక్ష్యం”

“పోచమ్మపై ఒట్టు…కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీప్రియ గెలుపే మా లక్ష్యం”

📰 Generate e-Paper Clip

నల్ల పోచమ్మ ఆలయ కమిటీ ఘన ప్రకటన
సదాశివపేట,ఫిబ్రవరి8(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మున్సిపాలిటీ 23వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ముగిటి లక్ష్మీప్రియకు మద్దతు రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా నల్ల పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమెకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతమ్మ మరియు శరత్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు “పోచమ్మపై ఒట్టు…మా ఓటు కాంగ్రెస్ అభ్యర్థికే” అంటూ స్పష్టంగా ప్రకటించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 23వ వార్డు అభివృద్ధి కోసం లక్ష్మీప్రియను భారీ మెజారిటీతో గెలిపించేందుకు తమ సంఘానికి చెందిన ప్రతి ఓటును ఆమెకే వేయిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకత్వం అవసరమని, అందుకే ఆమెకు మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎగమామిడి నాగరాజు, సురేష్, పెద్దలోడి బసంత్, రవీందర్, పాండు, యాదయ్య, గణేష్, మల్లేశం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular