📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురాష్ట్రస్థాయిలో సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన జెడ్పిహెచ్ ఎస్ కొండపాక బాయ్స్ విద్యార్థులు

రాష్ట్రస్థాయిలో సీఎం కప్ బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన జెడ్పిహెచ్ ఎస్ కొండపాక బాయ్స్ విద్యార్థులు

📰 Generate e-Paper Clip

•మహబూబ్ నగర్ లో జరిగిన పోటీల్లో ముగ్గురు విద్యార్థులకు బ్రాంజ్ పతకాలు-ఒక్కొక్కరికి రూ.10వేలప్రోత్సహికం. మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి25
ఈనెల 20 నుంచి 23 ఫిబ్రవరి వరకు మహబూబ్ నగర్ స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ కు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిభచాటారు.రాథోడ్ పవన్, వంక మురళీకృష్ణ, శివరాత్రి రాకేష్ హోరాహోరీగా పోరాడి బ్రాంజ్ పతకాలను సాధించారు. రాష్ట్రస్థాయిలో పతకాలుసాధించడం పాఠశాలకు గౌరవకారణమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ, పోటీలకు శిక్షణనిచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ నర్రా భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయు ల కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాంచాల నవీన శ్రీనివాస్ ప్రశంసించారు. గ్రామానికి మరిన్ని క్రీడా విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular