📄 ePaper
Friday, August 21, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుబోనాల వేడుకల్లో తెలంగాణ గొప్పదనం చాటిన చిన్నారులు.

బోనాల వేడుకల్లో తెలంగాణ గొప్పదనం చాటిన చిన్నారులు.

📰 Generate e-Paper Clip

“మనబోనం..మనబతుకమ్మ..మన సంస్కృతి..మన తెలంగాణ” అంటూ బోనాల వేడుకల్లో తెలంగాణ గొప్పదనాన్ని చాటిన డ్రీమ్ బిగ్స్ బ్రిలియంట్ స్కూల్ చిన్నారులు.
°డ్రీమ్ బిగ్స్ బ్రిలియంట్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
సిద్దిపేటనియోజకవర్గం,మనప్రజాప్రతినిధి:ఆగస్టు9
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను డ్రీమ్ బిగ్స్ బ్రిలియంట్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని చాటిచెప్పారు. బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ ఆచార సంప్రదాయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాధాన్యతను ప్రతిబింబించేలా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.మన సంస్కృతి, మన సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.
పాఠశాల కరస్పాండెంట్ సీహెచ్.సంతోష్ ఆధ్వర్యంలో, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ఈ. మౌనిక పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయులు నాగరాణి, దివ్య, రాచన, అమూల్య, శ్రావణి, హేమ, అనిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.