మనప్రజాప్రతినిధి//ఖాజీపేట ఆగష్టు 28:
కర్నూలు పట్టణంలోని ప్రేమ్‌నగర్, వెంకటరమణ కాలనీకి చెందిన పులి శశికళ, పులి చంద్రశేఖర్‌రెడ్డి దంపతుల ఏకైక కుమార్తె శ్రేయారెడ్డి వివాహం గౌతమ్‌రెడ్డితో శుక్రవారం పులివెందుల పట్టణంలోని ఎస్‌సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.
ఈ కళ్యాణ వేడుకలకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, ఆయన సతీమణి రెడ్యం లక్ష్మీ ప్రసన్న దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు కలకాలం సుఖసంతోషాలతో, అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందించారు.
వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
పులి వారి కళ్యాణ వేడుకల్లో రెడ్యం దంపతులు
RELATED ARTICLES



