Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకొత్త అవతారంలో పత్తి దళారులు

కొత్త అవతారంలో పత్తి దళారులు

📰 Generate e-Paper Clip

మెదక్(మనప్రజాప్రతినిధి  నవంబర్23):

సంగారెడ్డి జిల్లా: పత్తి సీజన్ మొదలయ్యాక, మార్కెట్లో కనబడే దళారులు ఇప్పుడు కొత్త అవతారంలో రంగంలోకి దిగారు, పత్తి రేట్లు ఊహించినంతగా  పెరగకపోవడం, అతివృష్టి కారణంగా పత్తి పంట, దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కౌలు రైతుల ఆవేదనను అవకాశంగా మార్చుకుని దళారులు, ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు, రైతుల నుంచి తక్కువ ధరకు, క్వింటాల్కు 6 వేల నుంచి 6,500 వరకు పత్తిని కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాల్లో అధిక రేటుకు అమ్మే, అక్రమ వ్యాపారం మరింత వేగం పెంచుకుంది, ఈ క్రమంలో దళారులు, భూస్వాముల నుంచి పట్టా- పాస్ బుక్కులను సేకరించి, తమ పేర్లతో కొనుగోలు జరిగినట్లు చూపిస్తూ, పెద్ద ఎత్తున వ్యాపారం జరుపుతున్నారు, పట్టా- పాస్ బుక్కులు, ఇచ్చిన రైతులకు క్వింటాల్కు  రూ, 200, నుంచి 500 వరకు అందజేసి మిగతా మొత్తం దళారుల జేబులోకి వెళ్ళిపోతుంది, కొంతమంది పత్తి దళారులు, సిసిఐ ఏర్పాటు చేసిన, కాటన్ మిల్లుల వద్ద మకాం వేసి, “కపాస్ ఆప్ “లో రైతుల పేరు మీద పత్తి కొనుగోలు లేకపోవడంతో, ఆ రైతులను ఆసరాగా చేసుకొని, వారి వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేసి, ముందుగా భూస్వాముల వద్ద నుంచి తీసుకున్న పట్టా -పాస్ బుక్కులపై, స్లాట్ బుక్ చేసి, సీసీఐకి అమ్మివేస్తున్నారు, ప్రస్తుతానికి కౌలు రైతులు నిల్వ చేసుకున్న పత్తిని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,
“కపాస్ ఆప్” సమస్య కారణంగా పత్తి కేంద్రాల్లో కొనుగోలు మందగించడం, మరోవైపు ప్రైవేటు వ్యాపారులు, రైతుల బలహీనతను లాభంగా మార్చుకోవడం, రైతాంగం ఆవేదనను మరింతగా పెంచుతుంది……

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular