📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఆదర్శ విద్యానికేతన్ E/M స్కూల్‌లో స్థానిక స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఆదర్శ విద్యానికేతన్ E/M స్కూల్‌లో స్థానిక స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా.మనప్రజాప్రతినిధి//నవంబర్ 29
సిద్దిపేట జిల్లా ఆదర్శ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం (E/M) స్కూల్‌లో స్థానిక స్వపరిపాలన దినోత్సవంను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ గుణాలు, బాధ్యతా భావం, పరిపాలనా నైపుణ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒక రోజు పాటు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ మరియు పాఠశాల సిబ్బంది పాత్రలను స్వీకరించి బాధ్యతలు నిర్వర్తించారు.విద్యార్థులు ప్రిన్సిపాల్‌, క్లాస్ టీచర్లు, డిసిప్లిన్ ఇన్‌చార్జ్‌, అసెంబ్లీ నిర్వహణ వంటి బాధ్యతలను చేపట్టి రోజువారీ పాఠశాల పనులను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యార్థులు చూపిన శ్రద్ధ, క్రమశిక్షణ పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చింది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లావణ్య రెడ్డి గారు మాట్లాడుతూ,“స్థానిక స్వపరిపాలన దినోత్సవం పిల్లలలో నాయకత్వం,నిర్ణయసామర్థ్యం,బాధ్యతవంటివిలువలనుపెంపొందిస్తుంది.ఉపాధ్యాయులు చేసే పనిని ప్రత్యక్షంగా అనుభవించడం వలన పిల్లల్లో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఈరోజు పిల్లలు ఎంతో అద్భుతంగా నిర్వర్తించారు” అని అన్నారు.కార్యక్రమం కరస్పాండెంట్ చెవిటి సంతోష్ కుమార్ సమక్షంలో విజయవంతంగా నిర్వహించబడింది. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular