Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుజర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ టీయూడబ్ల్యూజే ధర్నా కరపత్రాల ఆవిష్కరణ

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ టీయూడబ్ల్యూజే ధర్నా కరపత్రాల ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 02
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహా ధర్నా కోసం రూపొందించిన కరపత్రాలను టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు మారుపాక అనిల్ కుమార్, మండల ప్రెస్‌క్లబ్ సభ్యులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు వీరాహత్ అలీ, జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ పిలుపు మేరకు జరిగింది.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడం, జర్నలిస్టుల ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించడం, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం, వృత్తి కమిటీని వెంటనే ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.
డిసెంబర్ 3న హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు జరగనున్న మహా ధర్నాకు రాష్ట్ర, జాతీయ, జిల్లా, మండల నాయకులు తోడ్పడాలని, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రాకం సుమన్, ఏనుగుల మహేందర్, కొయ్యడ రాజయ్య, కముటం పర్శరాం, కందారం ఆంజనేయులు, గుండ రవిందర్, బండారి శ్రీనివాస్, కాసుపాక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular