📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసైబర్ క్రైమ్ బారినపడొద్దు సైబర్ మోసాలనివారణపైపోలీసులఅవగాహనమొదటి బహుమతి ఐటీ ఉద్యోగి వంశీకి

సైబర్ క్రైమ్ బారినపడొద్దు సైబర్ మోసాలనివారణపైపోలీసులఅవగాహనమొదటి బహుమతి ఐటీ ఉద్యోగి వంశీకి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం. డిసెంబర్ 3
సైబర్ మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మంగళవారం ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్విజ్ పోటీలను నిర్వహించారు.
నాగులబండ ఐటీ టవర్‌లోని వోల్టా రైడ్‌కు చెందిన ఐటీ ఉద్యోగి తమన్న బోయిన వంశీ క్విజ్‌లో ప్రతిభ కనబరచి మొదటి బహుమతి సాధించాడు. రెండవ స్థానంలో షేక్ సలీం నిలిచాడు. విజేతలకు సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ ప్రశంసాపత్రాలు, మెమెంటోలు అందజేశారు.సైబర్ నేరాల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలని, ప్రజలకు కూడా ఈ అవగాహనను చేరవేయాల‌ని ఐటీ ఉద్యోగులకు ఏసీపీ సూచించారు. కార్యక్రమంలో పలువురు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.