Wednesday, May 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుబాల్క సుమన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

బాల్క సుమన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

•వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆత్మకమిటీ నాయకులు
సిద్దిపేటనియోజకవర్గం//మనప్రజాప్రతినిధి,మే27:

మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షుడు కొలిమి బిక్షపతి ఆరోపించారు. సింగరేణి కార్యాలయాలను దగ్ధం చేయాలని, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని, రైల్వే లైన్లను పేల్చివేయాలని ప్రసంగంలో వ్యాఖ్యానించడం దేశద్రోహ చర్యలకు ప్రేరేపించే విధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బాల్క సుమన్‌పై చట్టరీత్యా వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని కోరుతూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేయాలని, మిలిటెంట్ వ్యవస్థలా మారాలని ప్రేరేపించే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపీకృష్ణ, రాష్ట్ర నాయకులు దాస అంజయ్య, మార్క సతీష్ కుమార్, సిద్దిపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, లహరి, వాహబ్, అజ్మత్, లక్ష్మీనారాయణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ పొన్నాల శ్రావణ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular