📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామస్థులకష్టసుఖాల్లోతోడుగాఉంటానన్నసర్పంచ్అభ్యర్థిపావనిరెడ్డి

గ్రామస్థులకష్టసుఖాల్లోతోడుగాఉంటానన్నసర్పంచ్అభ్యర్థిపావనిరెడ్డి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిది//కొండపాకమండలం.డిసెంబర్3
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల పరిధిలోని జప్తి నాచారం గ్రామ సర్పంచ్‌గా లక్కీ రెడ్డి శశిధర్ రెడ్డి సతీమణి లక్కిరెడ్డి పావని రెడ్డి బరిలో నిలిచారు. కుల–మత భేదాలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిత్వం దాఖలు చేశానని ఆమె తెలిపారు.
బుధవారం రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలు సమర్పించిన సందర్భంగా పావని రెడ్డి మాట్లాడుతూ“గ్రామస్థుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటాను. ప్రజల అభివృద్ధి, గ్రామ ప్రగతి పట్ల పూర్తి బాధ్యతతో పనిచేస్తాను” అని చెప్పారు.
నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు భారీగా హాజరయ్యారు. మాజీ సర్పంచ్ చింతల శ్రీనివాస్ గౌడ్, లక్కీ రెడ్డి శుభాకర్ రెడ్డి, సాల్లారపు రాంచెంద్ర రెడ్డి, పురుమల్ల రాజిరెడ్డి, వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్, ముస్త్యాల కొమురయ్య, ముస్త్యాల ఆశయ్య, ముస్త్యాల బండి రాములు, దాసరి యాదయ్య, మల్లయ్య యాదవ్, చెంద్రం యాదవ్, రాములు యాదవ్, సాగర్ యాదవ్, సీత కనకయ్య యాదవ్, సీత కొమర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.