Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్బూత్‌లలోపటిష్టతకేప్రధాన్యంటీడీపీ శ్రేణులవ్యూహాత్మకసమావేశం

బూత్‌లలోపటిష్టతకేప్రధాన్యంటీడీపీ శ్రేణులవ్యూహాత్మకసమావేశం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి,ఏర్పేడు మండలం.డిసెంబర్ 2
దుగ్గిపేరి మరియు పల్లాంపేట పంచాయతీల్లో టీడీపీ బూత్ స్థాయిని బలోపేతం చేయడం, ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా ఈరోజు విస్తృత స్థాయి విశ్లేషణా సమావేశం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు భారీగా హాజరయ్యారు.
సమావేశంలో బూత్ వారీ పరిస్థితులు, ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రజలతో మమకారం పెంచే కార్యక్రమాలు, మహిళా ఓటర్ల చేరిక వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక వ్యూహాలు రూపొందించారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు:నాయి బ్రాహ్మణ రాష్ట్ర ఛైర్మన్ సదాశివం, సీనియర్ నాయకులు పేరం నాగరాజు నాయుడు, ధనంజయులు నాయుడు, శివశంకర్ రెడ్డి, పాపిరెడ్డి, నైనూరు పున్నారావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి, ఏర్పేడు ఏసీఎస్ ఛైర్మన్ మహేష్ రెడ్డి, కృష్ణప్ప మొదలలియర్, యూనిట్స్ నాయకులు సీతపతి ఆచారి, బాబునాయుడు, కేశినేని సుబ్రహ్మణ్యం, రాఘవేంద్ర, రవినాయుడు, సురేష్, నరేంద్ర, గోల్డ్ మెన్, హరి, గుణాయాదవ్, నారాయణ, గణేష్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, మునిరెడ్డి, గురవయ్య, సుబ్రమయ్య, చంద్ర రెడ్డి, బూత్ కన్వీనర్ నాగేశ్వరరావు, సీవో.సీఓ కన్వీనర్ శ్రీనివాసులు, రమణయ్య, మునిరాజా, మునిశేఖర్, రవిచంద్ర, శ్రీకాంత్, శివ, చలపతి, వెంకటేశ్వర్లు, ముసలిపేడు బూత్ ఇంచార్జ్ వై. మనోహర్ నాయుడు తదితరులు.టీడీపీ శ్రేణుల ఉత్సాహం, బూత్ స్థాయి కట్టుదిట్టమైన ప్రణాళికలు రాబోయే ఎన్నికల్లో పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని నాయకులు నమ్మకం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular