📄 ePaper
Tuesday, July 28, 2026
Homeఆంధ్రప్రదేశ్కారాకొల్లుగ్రామప్రజలనుపరామర్శించిన ఎమ్మెల్యేబొజ్జలసుధీర్ రెడ్డి

కారాకొల్లుగ్రామప్రజలనుపరామర్శించిన ఎమ్మెల్యేబొజ్జలసుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి,శ్రీకాళహస్తినియోజకవర్గం

డిసెంబర్ 4
దిత్వా తుపాన్ కారణంగా ప్రజా రవాణా దెబ్బతిన్న ప్రాంతాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు. తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామంలో కాలువ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా గమనించారు.గ్రామస్థుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత మంత్రితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.తదుపరి పెద్ద కన్నలి సెంటర్‌లో తుపాన్ వలన నష్టపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు అధికారులను ఆదేశించారు. స్థానిక నాయకుడు కన్నలి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీ వాసులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular