📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఏకగ్రీవ సర్పంచ్‌కుమార్కెట్ డైరెక్టర్ చిరు,శ్రీకాంత్ గౌడ్ సన్మానం.

ఏకగ్రీవ సర్పంచ్‌కుమార్కెట్ డైరెక్టర్ చిరు,శ్రీకాంత్ గౌడ్ సన్మానం.

📰 Generate e-Paper Clip

సదాశివపేట,డిసెంబర్4(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలంలోని మెలిగిరిపేట్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎండి షాబుద్దీన్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ కలిసి నూతన సర్పంచ్ షాబుద్దీన్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు మాట్లాడుతూ, “ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచుతున్నారనే విషయం సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా స్పష్టమవుతోంది” అని చెప్పారు.
గ్రామ అభివృద్ధి కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ల సహకారం పొందుతూ మెలిగిరిపేట్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని షాబుద్దీన్‌కు ఆయన సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular