Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్తల్లిదండ్రుల ఆప్యాయత సమావేశం ఘనంగా నిర్వహించిన పంగూరు పాఠశాల

తల్లిదండ్రుల ఆప్యాయత సమావేశం ఘనంగా నిర్వహించిన పంగూరు పాఠశాల

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం,డిసెంబర్ 5
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పంగూరు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులుఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో దేవీ సరస్వతీ పూజ నిర్వహించి, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు అర్పించారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించి, తల్లిదండ్రులకు పిల్లల చదువు, భవిష్యత్ అభివృద్ధిపై ఉపాధ్యాయులు సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు నియమితంగా హాజరుకావడం అత్యంత ముఖ్యమని,బోధన సమయంలో శ్రద్ధగా వినడం,క్రమశిక్షణతో చదువును అభ్యసించడంభవిష్యత్తుకు పునాది అవుతుందని అన్నారు.ఇంటి వద్ద కూడా పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని వారు సూచించారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం అత్యవసరమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చేరి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular