📄 ePaper
Monday, July 27, 2026
Homeఆంధ్రప్రదేశ్డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం,డిసెంబర్ 4
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో డివిజనల్ అభివృద్ధి అధికారి (DDO) కార్యాలయాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యాలయాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు.కార్యక్రమానికి హాజరైన డీడీ ఓ సుస్మిత సహా పలువురు అధికారుల నుండి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం లభించింది.తరువాత ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular