నిందితుడి వద్ద నుంచి ₹3,92,500 నగదు స్వాధీనం – సిరిసిల్ల డీఎస్పీ
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్5
వేములవాడ సిరిసిల్ల బస్సులో జరిగిన నగదు దొంగతనం కేసును పోలీసులు వేగంగా చేధించి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సిరిసిల్ల డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.ఎలా జరిగింది ఘటన?
వేములవాడకు చెందిన నార్ల శ్రీనివాస్, హైదరాబాదులోని హోల్సేల్ దుకాణాలకు చెల్లించాల్సిన ₹3,97,500 నగదు, ఆధార్, పాన్, హెల్త్ కార్డు, ప్రెస్ అక్రిడిటేషన్ కార్డు, బస్ పాస్, రెండు చెక్కులఅన్ని ఉన్న పర్సును క్యాష్ బ్యాగ్‌లో ఉంచుకుని, డిసెంబర్ 3 ఉదయం 11:40 గంటలకు వేములవాడ బస్టాండ్ వద్ద బస్సులో ఎక్కారు.
లాస్ట్ సీట్ కింద బ్యాగ్ ఉంచి కూర్చొని, కొద్ది సేపటికి ముందు సీటుకు మారారు.సుమారు 12:15 గంటలకు తంగళ్లపల్లి చేరుకునే సరికి బ్యాగ్ కనిపించకపోవడంతో కండక్టర్‌ను విచారించారు. కండక్టర్ తెలిపిన వివరాల మేరకు సిరిసిల్ల వద్ద ఒక వ్యక్తి దిగినట్లు గుర్తించి, వెంటనే శ్రీనివాస్ సిరిసిల్ల టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
సీసీటీవీల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు వేములవాడ నుండి సిరిసిల్ల వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితుడిని వేములవాడ మండలం రుంద్రారం గ్రామానికి చెందిన బండారి బాలరాజుగా గుర్తించారు.ఈరోజు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా బస్సులో పిర్యాదుదారుని పక్కనే కూర్చున్నట్టు, అవకాశం దొరికినప్పుడు బ్యాగ్ దొంగిలించినట్టు,సిద్దిపేట టికెట్ తీసుకున్నప్పటికీ చంద్రంపేట వద్ద దిగినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు.మొత్తం నగదు రికవరీ పోలీసులు నిందితుడి వద్ద నుంచి ₹3,92,500 మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు.
ప్రజలకు డీఎస్పీ సూచనలుడీఎస్పీ పౌరులకు విజ్ఞప్తి చేస్తూ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు విలువైన వస్తువులు చేతుల్లోనే ఉంచుకోవాలి,చుట్టూ ఉన్న వారిని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి, అపరిచితుల నుంచి తాగునీరు లేదా ఎలాంటి తినుబండారాలు తీసుకోవద్దని హెచ్చరించారు.కేసు చేధించిన పోలీసు బృందానికి అభినందనలుఈ కేసును చాకచక్యంగా చేధించిన టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, రావికుమార్లను డీఎస్పీ అభినందించారు.
డబ్బులబ్యాగ్ దొంగతనంకేసుఛేదననిందితుడుఅరెస్ట్ రిమాండ్
RELATED ARTICLES

