Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమిరుదొడ్డిమండలంలోఅక్రమబెల్ట్‌షాప్‌పై కేసునమోదు

మిరుదొడ్డిమండలంలోఅక్రమబెల్ట్‌షాప్‌పై కేసునమోదు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్పేట్ భూంపల్లిమండలం.మిరుదొడ్డి మండలం,సిద్దిపేట జిల్లా.డిసెంబర్6
మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై ఎస్‌ఐ సమత కేసు నమోదు చేశారు. నమ్మదగిన సమాచారంతో మిరుదొడ్డి ఎస్‌ఐ సమత బృందం శనివారం మల్లుపల్లి గ్రామంలో సోదాలు నిర్వహించింది.సోదాలో గరిపల్లి లక్ష్మణ్ (తండ్రి అంజయ్య, వయస్సు 45 సంవత్సరాలు, కులం వైశ్య, వృత్తిబిజినెస్, నివాసం మల్లుపల్లి) ఇంటి వద్ద 12.39 లీటర్ల అక్రమ మద్యంను పోలీసు అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ సమత తెలిపారు. అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular