📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఏసీబీకిచిక్కినఅదనపుకలెక్టర్

ఏసీబీకిచిక్కినఅదనపుకలెక్టర్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి/హన్మకొండజిల్లా.డిసెంబర్ 05
హన్మకొండ కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సడన్‌ తనిఖీలు నిర్వహించి అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. సమాచారం మేరకు ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్ కోసం రూ.60 వేల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.జిల్లా ఇన్‌చార్జి DEOగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకట్ రెడ్డి, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ జట్టు దాడి చేసి తనితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా అధికారులు అరెస్టు చేశారు.ప్రస్తుతం హన్మకొండ కలెక్టరేట్ లోనే ఏసీబీ అధికారులు విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో పరిశీలన జరుగుతున్నట్టు తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.