📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజోగిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహా జన్మదిన వేడుకలు ఘనంగా

జోగిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహా జన్మదిన వేడుకలు ఘనంగా

📰 Generate e-Paper Clip

మెదక్:మనప్రజాప్రతినిధి//డిసెంబర్5
మంత్రి దామోదర్ రాజనర్సింహా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జోగిపేటలో శుక్రవారం వివిధ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మంత్రిగారి నివాసానికి అభిమానులు, నాయకులు తండోపతండాలుగా తరలి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వేలాది మంది అభిమానులు వచ్చినప్పటికీ మంత్రి వారందరిని ఓపికగా కలుసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అభిమానులతో కలిసి భారీ కేక్‌ను కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.
తరువాత జోగిపేట పట్టణంలో పర్యటించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా, కస్తూరిబా బాలికల వసతి శాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజీబీవీ, నర్సింగ్ విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థినులతో భోజనం చేసి, స్వయంగా వారికి వడ్డించారు.
బాలాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపులను మంత్రి ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.ఇక జోగిపేటలోని శ్రీరామ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన సభలో మంత్రిని నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వేలాది మంది అభిమానులు గజమాలతో మంత్రిని అభినందించారు ఈకార్యక్రమంలో
• నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి
• రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి
• మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్
• మెదక్, సంగారెడ్డి గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సుహాసిని రెడ్డి
• మార్కెట్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి
• శేరి జగన్మోహన్ రెడ్డి (మార్కెఫెడ్ డైరెక్టర్)
• మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య
• అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
• నియోజకవర్గ కీలక నాయకులు, భారీగా తరలివచ్చిన అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.