📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురైతుల పట్టా భూములను 22ఏలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ మహాధర్నా

రైతుల పట్టా భూములను 22ఏలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ మహాధర్నా

📰 Generate e-Paper Clip

31న సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా — బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు హాజరు
సిద్దిపేట,ఆగస్టు30(మనప్రజాప్రతినిధి):
రైతుల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.
రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు, మండల ప్రభారి వల్లేపురెడ్డి రజినీకర్ రెడ్డి మాట్లాడారు. రైతుల పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ ధర్నా కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. అలాగే మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడతారని పేర్కొన్నారు.
రైతుల సమస్యపై నిర్వహిస్తున్న ఈ మహాధర్నాకు పెద్ద సంఖ్యలో రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్తినేని రాజు, మండల ప్రధాన కార్యదర్శి బోయిని సురేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పరకాల తిరుపతి రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బైతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.