మనప్రజాప్రతినిధి//సిద్ధిపేటరూరల్.డిసెంబర్6
సిద్ధిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో శుక్రవారం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామ స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. గ్రామంలోని పెద్దలు, యువత, సంఘ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా కుంభం సురేష్ రెడ్డి ఎన్నిక కాగా, సంఘ కార్యకలాపాల పర్యవేక్షణ, నిధుల నిర్వహణ బాధ్యతలకు రజినీకాంత్ రెడ్డి క్యాషియర్‌గా ఎంపికయ్యారు. అలాగే సంఘ అభివృద్ధికార్యక్రమాలనువేగవంతం చేయడానికి ఉపాధ్యక్షులుగా ధర్మయ్య గారు ప్రణీత్ రెడ్డి లను ఎన్నుకున్నారు. సంఘానికి దిశానిర్దేశం చేసే కీలక పదవిగా ఎం. బాల్రెడ్డి ప్రధాన సలహాదారుడిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సభలో మాట్లాడిన కొత్త అధ్యక్షుడు కుంభం సురేష్ రెడ్డి మాట్లాడుతూ,“సంఘం నాపై ఉంచిన విశ్వాసానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. రెడ్డి సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం ఎలాంటి రాజీ లేకుండా కృషి చేస్తాను. యువతను సంఘ కార్యకలాపాల్లో భాగస్వామ్యులను చేస్తూ, సామాజిక సేవలో ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉన్నాను” అని పేర్కొన్నారు.కొత్త కమిటీ ఎన్నికల సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, సమాజ అభివృద్ధి కోసం ఈ కమిటీ ఒక మంచి బృందంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలోని రెడ్డి సంఘ నాయకులు, యువ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త కమిటీని అభినందించారు.కార్యక్రమం చివర్లో ఎన్నికైన కమిటీ సభ్యులకు సంఘ నాయకులు అభినందనలు తెలియజేశారు.
ఇరుకోడులోరెడ్డిసంక్షేమసంఘంఎన్నికలుకొత్తకమిటీబాధ్యతలుస్వీకారం
RELATED ARTICLES

