మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్6
విద్యార్థుల మధ్యాహ్న భోజనం నుంచి వారి మెరుగైన భవిష్యత్తు వరకు బాధ్యతగా నిలుస్తూ, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నెలనెలా పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో కలసి కూర్చొని భోజనం చేస్తున్నారు.“పిల్లల భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారం అత్యవసరం” అని భావించిన ఆయన, పాఠశాలల్లో ఆకలిఆరోగ్యంభవిష్యత్తు అన్న మూడు అంశాలు బలపడేలా ప్రత్యక్షంగా నాణ్యతను పరిశీలిస్తున్నారు.నాణ్యమైన ఆహారం.భద్రమైన భవిష్యత్తుతెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన “బడి అంటే అమ్మలాంటిది” అనే ఆత్మీయ కార్యక్రమం ద్వారా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను మరింత మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో పురుగులు పట్టిన బియ్యం, సరిగ్గా ఉడకని భోజనం వల్ల పిల్లలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇకపై పునరావృతం కాకూడదన్న సంకల్పంతో పరిశుభ్రత, పౌష్టికాహారం, రుచి తదితర అంశాలపై ప్రధాన దృష్టి పెట్టింది.విద్యార్థుల మధ్యకు వెళ్లి వారి కలలు అడుగుతున్న ఎమ్మెల్యేప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో భోజనం చేస్తూ, వారితో సన్నిహితంగా మాట్లాడుతూ
“ఎమవ్వాలని అనుకుంటున్నారు?”“మీ కలలు ఏమిటి?”అని అడిగి, వారికి సరైన దారి చూపిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు. పిల్లలతో ఇంత దగ్గరగా మెలుగుతున్న ప్రజాప్రతినిధులు అరుదు అందుకే ఆయన ప్రయత్నం ప్రశంసనీయం. ముఖ్యమంత్రికి, మంత్రు లకుఎమ్మెల్యే ధన్యవాదాలుఈ మహోన్నత కార్యక్రమానికి నాంది పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు, విద్యాశాఖ & ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“బడి… అమ్మలాసంరక్షిస్తుంది”ఎమ్మెల్యే బొజ్జలవెంకటసుధీర్ రెడ్డి
RELATED ARTICLES

