📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రభుత్వవ్యవస్థలోపారదర్శకతేలక్ష్యంఅవినీతివ్యతిరేకవారోత్సవాలుప్రారంభం

ప్రభుత్వవ్యవస్థలోపారదర్శకతేలక్ష్యంఅవినీతివ్యతిరేకవారోత్సవాలుప్రారంభం

📰 Generate e-Paper Clip

సంగారెడ్డిజిల్లా.డిసెంబర్6(మనప్రజాప్రతినిధి)
అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవినీతి వ్యతిరేక వారోత్సవాలు సంగారెడ్డి జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ చేతుల మీదుగా అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత సేవలందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా అవినీతి సంఘటనలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.జిల్లా పరిధిలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినా, డిమాండ్ చేసినా, అనుమానాస్పద ప్రవర్తన కనిపించినా వెంటనే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.అవినీతిని నిర్మూలించడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, అందిన ప్రతి ఫిర్యాదును గోప్యంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఏసీబీ డీఎస్పీ కె. సుదర్శన్, ఇన్స్పెక్టర్ ఎ. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular