Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుతిమ్మానగర్ గ్రామంలో రాజకీయ వేడి

తిమ్మానగర్ గ్రామంలో రాజకీయ వేడి

📰 Generate e-Paper Clip

సర్పంచ్ అభ్యర్థిగా పొలబోయిన యాదగిరి నామినేషన్ దాఖలు
మెదక్ మండలం.తిమ్మానగర్ గ్రామండిసెంబర్7
మనప్రజాప్రతినిధి//తిమ్మానగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పొలబోయిన యాదగిరి ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వచ్చానని యాదగిరి గ్రామ ప్రజలతో వెల్లడించారు.నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ “తిమ్మానగర్ ప్రజలు నాకు ఓటుతో ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. ప్రతి ఒక్కరి సమస్యకు అందుబాటులో ఉంటా.”అని తెలిపారు. అలాగే, మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సారథ్యంలో గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ప్రజల్లో పథకాలపై అవగాహన పెంచి, ప్రతి ఇంటికి ప్రభుత్వం అందించే సంక్షేమం చేరేలా కృషి చేస్తానని యాదగిరి స్పష్టంచేశారు.“ప్రతి ఒక్కరూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి నన్ను సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించండి. మీ సేవకుడిగా మీ కోసం పనిచేస్తాను” అని ఆయన గ్రామ ప్రజలను కోరారు.తిమ్మానగర్ గ్రామంలో ఎన్నికల జోష్ మరింత పెరిగింది…

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular