📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్ప్రజా ఉద్యమానికి చిహ్నంగా కోటి సంతకాలు: జిల్లా పార్టీ కార్యాలయం దిశగా భారీ ర్యాలీ

ప్రజా ఉద్యమానికి చిహ్నంగా కోటి సంతకాలు: జిల్లా పార్టీ కార్యాలయం దిశగా భారీ ర్యాలీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్10
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంలో భాగంగా సేకరించిన సంతకాల పత్రాలను ఈరోజు ఘనంగా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు.మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పార్టీ జెండా ఊపి సంతకాల పత్రాలను అధికారికంగా తరలించడం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారురాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ కోటి సంతకాలు, పేద విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు అందుబాటు వైద్య సేవలను కోల్పోవద్దన్న ప్రజా మనోగతాన్ని స్పష్టంగా తెలియజేస్తు న్నాయని నాయకులు పేర్కొన్నారు.ఈ సంతకాల పత్రాలను త్వరలోనే గవర్నర్ దృష్టికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. పాల్గొన్న నాయకులుఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,నియోజకవర్గ పరిశీలకులు ఓదురు గిరిధర్ రెడ్డి, వయ్యాల కృష్ణారెడ్డి,జెడ్పిటిసి సంధ్యారాణి,బర్రి సుదర్శన్ రెడ్డి, రత్నం రెడ్డి, సిరాజ్ భాష,కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి, వయ్యాల మనోహర్ రెడ్డి,ఉత్తరాజి శరవణ కుమార్, బుల్లెట్ జై శ్యామ్ రాయల్,గంగారి రమేష్, రేణిగుంట సర్పంచ్ నగేష్, ప్రభాకర్, మున్నా రాయల్,పటాన్ ఫరీద్, గోరా, సాగిర్ బీ, పసల సుమతి, సునీత సింగ్, షర్మిల ఠాగూర్, నివేత, రాణి, పర్వీన్, సరోజమ్మ, పులి రామచంద్ర, శ్రీవారి సురేష్, కొగిలి సుబ్రమణ్యం, మునిశేఖర్, పసలు కృష్ణయ్య, శివకు మార్యాదవ్, అస్లాం,రంగయ్య, గఫూర్, ఫజల్, చింత రాజేంద్ర, చెంచయ్య నాయుడు,ఖదీర్, జీవీకే రెడ్డి, గాడిపాకుల కిరణ్, శ్రీరాముల్ రెడ్డితదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.