📄 ePaper
Sunday, July 12, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుభూంపల్లి అభివృద్ధికి కత్తెర గుర్తే మార్గంసర్పంచ్ అభ్యర్థి ఎల్లన్నగారి వంశీ రెడ్డి ప్రజల చేతినిండా ఆశీర్వాదం...

భూంపల్లి అభివృద్ధికి కత్తెర గుర్తే మార్గంసర్పంచ్ అభ్యర్థి ఎల్లన్నగారి వంశీ రెడ్డి ప్రజల చేతినిండా ఆశీర్వాదం కోరుతూ ప్రచారంవేగం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్పేట–భూంపల్లి దుబ్బాకనియోజకవర్గం.సిద్దిపేటజిల్లాడిసెంబర్ 11
అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లన్నగారి వంశీ రెడ్డి గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలను పలకరిస్తూ, తమకు లభించిన ఆదరణపై సంతోషం వ్యక్తం చేశారు.వంశీ రెడ్డి మాట్లాడుతూ“నేను పదవి కోసం కాదు… సేవ కోసం ముందుకొస్తున్నాను.భూంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం నా ఒకే లక్ష్యం. గ్రామాభివృద్ధిలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలను అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటాను. మీ అందరి శ్రేయస్సే నా ధ్యేయం,” అని తెలిపారు.అధికార పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తానని, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మహిళా సంఘాల అభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారంలో ప్రజలతోపాటు నడుచుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.అయన ఇంకా మాట్లాడుతూ“ఒక్కసారి ఈ సేవకునికి అవకాశం ఇవ్వండి. అబద్ధాలు చెప్పను… అభివృద్ధి చేసి చూపిస్తాను. మీ ప్రేమ, దయ, ఆశీర్వాదాలతో ముందుకు సాగుతాను. గ్రామంలోని ప్రతి పని ప్రజల అనుమతితోనే ప్రారంభిస్తాను,” అని ప్రజల ముందుంచా రు.గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాలు, కుల సంఘాల పెద్దలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.అభ్యర్థి ఎల్లన్నగారి వంశీ రెడ్డి కత్తెర గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.“ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఒక్కో ఓటు కత్తెర గుర్తు మీద వేయండి… భూంపల్లి అభివృద్ధికి నన్ను సర్పంచిగా గెలిపించండి” అని వంశీ రెడ్డి ప్రజలకు అభ్యర్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular