📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యపై బొజ్జల బృందమ్మ ప్రత్యేక దృష్టి

విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యపై బొజ్జల బృందమ్మ ప్రత్యేక దృష్టి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రేణిగుంట మండలం.డిసెంబర్ 13
రేణిగుంటలోని గురుకుల పాఠశాలను మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి, ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ శనివారం ఆకస్మికంగా సందర్శించి విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, విద్యా ప్రమాణాలపై ఆమె సమగ్ర సమీక్ష చేపట్టారు. తరగతులనిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు పట్టికలు, పరిశుభ్రత పరిస్థితుల ను స్వయంగా పరిశీలించిన ఆమె హాస్టల్ గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను తనిఖీ చేసి వాటి నిర్వ హణపై అధికారులను ప్రశ్నించారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడిన బొజ్జల బృందమ్మ, వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతను మెరుగుపరచాలని, హాస్టల్ పరిసరాల్లో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, చదువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఆమె స్పష్టం చేశారు.పాఠశాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు నిరంతర సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతు లు కల్పించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.