📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురామేశ్వరంపల్లి అభివృద్ధికి నూతన దిశ చూపనున్న పల్లె మరియాసుధాకర్

రామేశ్వరంపల్లి అభివృద్ధికి నూతన దిశ చూపనున్న పల్లె మరియాసుధాకర్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లా
అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని కుడవెల్లి రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి పల్లె మరియా సుధాకర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ గ్రామ సమగ్రాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామస్థులకు నమస్కరించి మాట్లాడుతూ, తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ ప్రజల సహకారంతో పారదర్శకమైన, అవినీతి లేని పాలన అందించడమే తన ధ్యేయమని ఆమె తెలిపారు. గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు.ప్రధాన అభివృద్ధి హామీలు1.ప్రయాణికులసౌకర్యార్థంగ్రామంలోఉన్నకూడవెల్లి చిన్నవాగు బ్రిడ్జిని ప్రభుత్వ అనుమతులతోపెద్ద బ్రిడ్జిగానిర్మించడం.
2.మహిళలఆర్థికస్వావలంబనకోసంప్రభుత్వసహకారంతోకుట్టుమిషన్ సెంటర్ ఏర్పాటు.
3. ప్రతి కులానికి ప్రతినిధులతో నూతన గ్రామ డెవలప్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేసి, సమాన న్యాయంతో సమస్యల పరిష్కారం.
4. దళిత మహిళల ఉపాధి కోసం దళితవాడలో నూతన బీడీ ఖర్కానా ఏర్పాటు.
5. పాడి పశువులు, గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వ సబ్సిడీ రుణాలు అందేలా చర్యలు.
6. రైతులకు రుణమాఫీ, కొత్త రుణాలు, వ్యవసాయ సామగ్రి సబ్సిడీ లోన్లు ఇప్పించడం.                                                                  7.ప్రజల ఆరోగ్యపరిరక్షణ కోసంనెలకు ఒకసారి హెల్త్ క్యాంపులు, ఉచిత మందుల పంపిణీ.
8. మహంకాళమ్మ గుట్ట నుంచి రాంపురం వెళ్లే మార్గంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణం.
9. ఆధునిక వీధి దీపాలు,సీసీ కెమెరాల ఏర్పాటుద్వారాగ్రామభద్రత పెంపు.
10.రైతులు పండించిన పంటను ఐకెపి కేంద్రం ద్వారా న్యాయధరలకు కొనుగోలు చేయించడం.
11.విద్యార్థులకునాణ్యమైన విద్య,పౌష్టికాహారం,అనాధ పిల్లలకుహాస్టల్ వసతి.
12.నూతనగ్రామపంచాయతీభవనం,అంగన్‌వాడీభవనాలనిర్మాణం.
13.యువతీ యువకులకు ఉపాధి కల్పన కోసం ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి ఉద్యోగ సమాచారం అందించడం.
14. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నూతన పెన్షన్లు మంజూరు అయ్యేలా సహకారం.
15. ఉపాధి హామీ పథకంలో కొత్త జాబ్ కార్డులు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.
16. విద్యుత్ కొరత లేకుండా ట్రాన్స్‌ఫార్మర్లు, స్థంభాల ఏర్పాటు.
17. రైతులకు ఎరువులు, మందులు సకాలంలో అందుబాటులో ఉంచడం.                                                                    18. గ్రామంలో నిరంతర మంచినీటి సరఫరా కల్పించడం.             19. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ.
20. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా మైక్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలతో నేరుగా సంభాషణ, అవినీతి రహిత పాలన.గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రామేశ్వరంపల్లి సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి పల్లె మరియా సుధాకర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.