📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకొడుకుపైతండ్రిఘనవిజయం

కొడుకుపైతండ్రిఘనవిజయం

📰 Generate e-Paper Clip

ఝాన్సీలింగాపూర్‌లోఆసక్తికరగ్రామపంచాయతీ ఫలితం
మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా.డిసెంబర్15
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫలితం వెలువడింది. గ్రామానికి చెందిన ప్రముఖ బొక్కల ఆయుర్వేదిక్ వైద్యుడు మానేగల రామ కిష్టయ్య తన కుమారుడు వెంకటేష్‌పై 99 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో మానేగల రామ కిష్టయ్యకు 684 ఓట్లు రాగా, ఆయన కుమారుడు వెంకటేష్‌కు 585 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో తండ్రి–కొడుకుల మధ్య జరిగిన ఈ పోటీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఈ విజయంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, ముదిరాజ్ మహాసభ నాయకులు, పీసీసీ సభ్యుడు సుప్రభాతురావు తదితరుల మద్దతు కీలకంగా నిలిచినట్లు తెలుస్తోంది.గ్రామ ప్రజల విశ్వాసంతో గెలిచిన రామ కిష్టయ్యను గ్రామస్తులు, నాయకులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.